కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్‌ కన్నుమూత

Posted On:06-01-2016
No.Of Views:340

జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌(79) గురువారంనాడు ఢిల్లీలోని ఆలిండియా మెడికల్‌ సైన్సెస్‌లో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ముఫీ మహ్మద్‌ గత ఏడాది చివర్లో డిసెంబర్‌ 24న మెడ నొప్పి, తీవ్ర జర్వంతో ఎయిమ్స్‌లో చేరారు. ఇన్సెంటివ్‌ కేర్‌లో చికిత్సపొందుతుండగా, రక్త ప్రసరణ తగ్గడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు ఎంత శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ గత ఏడాది మార్చి తన పార్టీ పిడిపిని స్వశక్తితో గెలిపించుకున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకొని మార్చినెలో అధికారంలోకి వచ్చారు. ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ వ్యూహంతో పిడిపిని ముందుకు నడిపించారు. అబ్దుల్లా ఫరూఖ్‌ ప్రభుత్వంలో హోంమంత్రిగా పని చేసిన ముఫ్తీ మహమ్మద్‌,నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో విభేదించి ప్రొగ్రెసివ్‌ డెమాక్రటిక్‌ పీపుల్స్‌ పార్టీని స్థాపించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఒమర్‌ అబ్దుల్లా నాయకత్వంలో పతనమవ్వడంతో పిడిపికి కశ్మీరీ ప్రజు అవకాశమిచ్చారు. ముఫీ మరణంతో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మహబూబాకు దక్కే అవకాశముంది.