మలేరియాతో బాధపడుతున్న భారత్‌

Posted On:06-01-2016
No.Of Views:297

ఔను భారత్‌ మలేరియాతో బాధపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ) లెక్క ప్రకారం భారత దేశంలో మలేరియాతో దాదాపు 18 కోట్ల మంది బాధపడుతున్నారు. అంటే ప్రతి ఏడుగురిలో ఒకరికి మలేరియా సోకుతుంది. ఈ లెక్కు దేశాన్ని వణికించవచ్చు. కానీ ఇది నిజమని డబ్ల్యూహెచ్‌ఒ చెబుతోంది. అయితే ప్రపంచంలో భారత్‌కన్నా వెనుకబడిన పాకిస్థాన్‌, ఇథోపియా, ఇండోనేషియా దేశా కన్నా కూడా భారత్‌ ఈ విషయంలో దిగజారిందని డబ్ల్యూహెచ్‌ఒ కథనం. కారణమేమిటంటే భారతప్రభుత్వం మలేరియా నిర్మూనకు అతితక్కువ బడ్జెట్‌ను కేటాయించడమేనని చెప్పొచ్చు. 
భారతదేశంలో మలేరియా నివారణకు రూపొందించిన నేషనల్‌ వెక్టర్‌ బర్నె డిసీస్‌ కంట్రోల్‌ ప్రొగ్రామ్‌(ఎన్‌విబిడిసిపి) 138 మిలియన్ల మందిని పరీక్షించగా అందులో 1,102 మిలియన్ల మందికి మలేరియా నిర్థారణ అయ్యింది.  2011లో ఇదే కార్యక్రమం కింద పరీక్షు జరపగా 1.31 మిలియన్ల కేసు నమోదయ్యాయి. 2013లో అత్యధికంగా 88 మిలియన్ల  కేసు నమోదయ్యాయి. 2012లో 1.06 మిలియన్లు నమోదయ్యాయి. ఇక 2012లో 519 మంది 2014లో 562 మంది మలేరియాతో చనిపోయారు.
దేశంలో ఎక్కువగా మలేరియా మరణాు ఒడిషా,త్రిపుర రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఒడిషాలో అత్యధికంగా 3,95,000 కేసు నమోదవ్వగా, చీత్తీస్‌గడ్‌లో 1,28,000 కేసు, జార్ఖండ్‌లో 1,03,000 కేసు నమోదయ్యాయి. త్రిపురలో మలేరియా వ్యాధి నివారణ చర్యు చేపట్టడంతో అక్కడ వ్యాధి తగ్గుముఖం పట్టింది. గత ఏడాది 49,653 కేసు నమోదవ్వగా 96 మంది మృత్యువాత పడ్డారు. ఇక తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన వ్యాధినిరోధక కార్యక్రమం సత్ఫలితాలిచ్చింది. గణనీయంగా వ్యాధి తగ్గుముఖం పట్టింది. 2011లో 22,171 మలేరియా కేసు నమోదవ్వగా వ్యాధి నిరోధక కార్యక్రమం కారణంగా గత మూడేళ్లల్లో కేవం సగటున 8,729 కేసు నమోదయ్యాయి.