ఎంత లేటు వయసులో పెళ్లి!

Posted On:17-01-2016
No.Of Views:291

అదేంటి లేటు పెళ్లి ఏమిటని ముక్కున వేలేసుకుంటున్నారా! అవున్నిజం. ఉత్తరాదిన నలభై దాటితేనే పెళ్లి. నలభై ఏళ్లకు పెళ్లేమిటనుకుంటున్నారా! అక్కడ ఎంత లేటుగా పెళ్లి జరిగితే అంత వైవాహిక జీవితం సఫమైనట్లే!
 పంజాబ్‌,బీహార్‌,మహారాష్ట్ర,ఉత్తరాంచల్‌ ఏ రాష్ట్రమైతేనేమీ, ఎక్కడైనా సరే లేటు పెళ్లికే అక్కడి అవివాహితులు ఇష్టపడుతున్నారు. త్వరగా పెళ్లయితే వైవాహిక జీవితం సవ్వంగా సాగదట. గొడవలు,కొట్లాటు,విడాకులు వరుసగా వచ్చేసి,పెళ్లిళ్లు కాస్తా పెటాకువుతున్నాయని అక్కడి అవివాహితులు నమ్మకం. ఇది ఏ సర్వేనో చెప్పింది కాదు 2011 జనాభా లెక్కల్లో ఈ విషయం బయట పడిరది.ఉత్తరాదిన దాదాపు 11`12శాతం మంది లేటు వయస్సులోనే పెళ్లి చేసుకున్నారని తేలింది. మహారాష్ట్రలో 7శాతం,మేఘాలయలో 4.1శాతం,హర్యానాలో 33 శాతం లేటు వివాహాలు జరిగాయి.
 సామాజిక వేత్త అభిప్రాయం ప్రకారం లేటు వయస్సులో పెళ్లిళ్లు జరగడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, అన్యోన్యత, అవగాహన కలుగుతుందని, తద్వారా ఆరోగ్యం ఇనుమడిస్తుందని వారి భావన. ఇలా జరిగితే వైవాహిక జీవితం దీర్ఘకాం సాగుతుందని వారంటున్నారు.
ఇలా నల భై ఏళ్ల తరువాత జరిగిన వివాహాల్లో విడాకులకు పరిగెత్తింది కేవం 1.1 శాతం మందేనని గౌహతి యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ బీమల్‌ కర్‌ జరిపిన సర్వేలో తేలింది. ఇలా వివాహాలు చేసుకున్న వారు ఎక్కువ కాల  జీవించే అవకాశం కూడా ఉందట. తెలుగురాష్ట్రాల్లోని పట్టణాల్లో వివాహ వయస్సు 18-21 వచ్చిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బాలిక రజస్వల  అయిన వెంటనే వివాహ సంబంధాలు చూస్తుంటారు.
ఆస్యంగా పెళ్లిళ్లు జరుపుకునే రాష్ట్రాలైనా హర్యానా,మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్‌,మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌లో 11శాతం లేటు వివాహాలే జరుగుతుంటాయి. ఇక డిఎన్‌ హవేలి, అస్సాం,నాగాలాండ్‌,అరుణాచల్‌ ప్రదేశ్‌,మేఘాలయా రాష్ట్రాల్లో లేటు వివాహా సంఖ్య ఐదుశాతానికి మించడం లేదు.