అత్యధికంగా పండ్లను పండిరచే రెండో దేశం భారత్‌

Posted On:17-01-2016
No.Of Views:285

విశ్వమార్కెట్‌లో పండ్లను అత్యధికంగా పండిరచే రెండో స్థానంలో భారత్‌ చేరింది. మొదటి స్థానంలో చైనా ఉంది. 1960-70లో గ్రీన్‌ విప్లవం తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో విరివిగా పండ్లను రైతులు పండిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ వ్లెడిరచిన వివరాల ప్రకారం గత ఏడాది 107.4 వే టన్నుల ద్రాక్షను ఎగుమతి చేసి, 1,086 కోట్లను ఆర్జించినట్లు ఈ శాఖ పేర్కొంది. పండ్లను అత్యధికంగా పండిరచే యుఎస్‌,బ్రెజిల్‌,స్పెయిన్‌,మెక్సికో,ఇటలీ, ఇండోనేషియా, ఫిఫైన్స్‌,టర్కీు దేశాలు భారత్‌తో పోటీ పడుతున్నాయి. ఇక చిన్న పట్టణాలు సైతం పండ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు,అనంతపురం జిల్లాల్లో పండ్ల తోటు విస్తారంగా ఉన్నాయి. ఇక తెంగాణ రాష్ట్రంలోని న్లగొండ జిల్లాలో పండ్లతోట పెంపకం సాగుతోంది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌,షెహదోల్‌,పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగ్‌,మహారాష్ట్రలోని పూణే, ఔరంగాబాద్‌,జల్‌గావ్‌,సంగ్లీ పండ్ల తోట పెంపకంలో మొదటిస్థానాన్ని ఆక్రమించాయి.
చైనా 2013లో 154 మిలియన్‌ టన్నల పండ్లను ఉత్పత్తి చేయగా, ఇండియా 82,బ్రెజిల్‌ 37,అమెరికా 26,స్పెయిన్‌ 17, మెక్సికో 17,ఇటలీ 16,ఇండోనేషియా 16 మి.టన్నుల పండ్లను ఉత్పత్తి చేశాయి.
 ఇక దేశంలో పండ్ల ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుంటే మహారాష్ట్ర దేశంలోనే అత్యధికంగా పండ్లను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌,గుజరాత్‌,తమిళనాడు,ఉత్తరప్రదేశ్‌,కర్నాటక,మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలున్నాయి.