తమిళ చిత్రం రిమేక్‌లో పవన్‌

Posted On:01-02-2016
No.Of Views:325

పవన్‌కళ్యాణ్‌ అభిమానులకు శుభవార్త. ఖుషీ సినిమా దర్శకుడు ఎస్‌జె సూర్యతో రెండో సినిమాకు పవన్‌ సిద్ధమవుతున్నాడు. కేరళాలో సర్ధార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా షూటింగ్‌లో ఉన్న పవన్‌ను ఎస్‌జె సూర్య ఇటీవల కలిశాడు. అజిత్‌ హీరోగా తమిళంలో సూపర్‌డూపర్‌ హిట్టయిన ’వేదం‘ సినిమా కథను వినిపించి,దీన్ని రిమేక్‌ చేస్తే బాగుంటుందని సూచించాట్ట. ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే. ఈ కథపై నాలుగైదు విడతలుగా చర్చలు జరిగాక, కొన్ని మార్పులు చేర్పులుతో ఈ సినిమా చేయడానికి పవన్‌ ఒప్పుకున్నాడట. వేదంలో ప్రతీకారం తీర్చుకునే పాత్రలో అజిత్‌ నటించాడు. క్రైమ్‌, యాక్షన్‌, వినోదాన్ని మేళవించిన ఈ సినిమా తమిళంలో నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో అజిత్‌ పాత్రకు పవన్‌ అయితే బాగుంటుందని ఎస్‌జె సూర్య, పవన్‌ను సంప్రదించి సక్సెస్‌ అయ్యాడు.