భారతీయ ఉత్పత్తులను తిరస్కరించిన అమెరికా

Posted On:08-02-2016
No.Of Views:303

బెంగుళూరు: మన దేశానికి చెందిన 13,334 ఉత్పత్తును ఐదేళ్ల పాటు అమెరికాలో మార్కెటింగ్‌ చేయకుండా యుఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డిఏ) తిరస్కరించింది. ఈ ఉత్పత్తుల్లో మెడిసన్స్‌,జనరిక్‌ మెడిసన్స్‌, స్నాక్స్‌, బేకరీ ఉత్పత్తులు, స్పైసీస్‌, స్నానానికి సంబంధించిన సబ్బులు ఇత్యాదున్నాయి.
మన దేశానివి మాత్రమే కాదు. చైనాకు చెందిన 15,087 ఉత్పత్తులను ఎఫ్‌డిఏ తిరస్కరించింది. ఈ ఉత్పత్తులను తిరస్కరించడానికి యుఎస్‌ వాణిజ్య,పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులు కారణాలు చెబుతూ వీటిని ఉత్పత్తులను వినియోగించడం ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయంటున్నారు.ప్యాకేజింగ్‌, మిస్‌బ్రాండిరగ్‌,నాణ్యత లేమి, స్థాయికి మించి పోషకాలు  ఉండటం,సరైన వివరాలు లేకుండా లేబుళ్లను అంటించడం ఇలాంటి కారణాలను మంత్రిత్వ శాఖ చూపిస్తోంది.  ఈ ఏడాది జనవరి మాసంలో 228 వస్తువులను తిరస్కరించిన ఎఫ్‌డిఎ, చైనాకు చెందిన 314 ఉత్పత్తులను పక్కన పెట్టింది. ఎప్పుడైతే మన దేశం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం చేపట్టిన సందర్భంలో ఇటాస్‌ ఫార్మాస్ట్యూటికల్‌ లిమిటెడ్‌, సానాఫి ఇండియా లిమిటెడ్‌ విడుదల చేసిన మూడు డ్రగ్స్‌ను యుఎస్‌ ఎఫ్‌డిఏ వివిధ సాకులు చెప్పి తిరస్కరించింది. మన దేశానికి చెందిన ఉత్పత్తులను ఎఫ్‌డిఏ తిరస్కరించడమే కాక, ఆయా కంపెనీ యజమానుకు తాఖీదు కూడా పంపింది. దీనిపై బయోకాన్‌ సిఎండి కిరణ్‌ ముజుందార్‌ వివరణనిస్తూ తమ ఉత్పత్తులను తిరస్కరిస్తూ యుఎస్‌ ఎఫ్‌డిఏ నుంచి నోటీసు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే వాటిని పరిశీలించి, సరిదిద్దుకుంటామని స్పష్టం చేశారు. తిరస్కృత ఉత్పత్తుల జాబితాలో ఆంధ్రకు చెందిన ఆరు ఉత్పత్తులు కూడా ఉన్నాయి. వీటిని ఉపయోగించడం అంత సురక్షితం కాదని ఎఫ్‌డిఏ తేల్చింది.  యుఎస్‌ ఎఫ్‌డిఏ చర్యపై  ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సాహీ వ్యాఖ్యానిస్తూ గతంలో ఎప్పుడు లేని కారణాలు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయని ప్రశ్నించారు. భారతీయ మార్కెట్‌ ఎప్పుడూ నాణ్యమైన,అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నవేనన్నారు. విశ్వ మార్కెట్‌లో భారతీయ ఉత్పుత్తులు అధిక వాటాను చేజిక్కించుకుంటోందని, దీనితో దేశీయ ఉత్పత్తులకు నష్టం కలుగుతుందన్న సాకుతోనే యుఎస్‌ ఎఫ్‌డిఏ ఈ చర్యకు పాల్పరడిదని ఆరోపించారు.