ఇద్దరు మిత్రులు..ఇప్పుడు శతృవులు

Posted On:12-03-2016
No.Of Views:337

సంజయ్‌`సల్మాన్‌ఖాన్‌ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌, సాజన్‌ వంటి సినిమాలో ఇద్దరు నటించి మెప్పించారు. ఇప్పుడు కూడా వాళ్ల ఫ్రెండ్‌షిప్‌కు డోకా లేదనుకుంటే పప్పులో కాలేసినట్లే!. ఈ మధ్యే ఖల్‌నాయక్‌ జైు నుండి విడుదలై ఇంటికి వచ్చాడు. సంజయ్‌దత్‌కు బాలీవుడ్‌ మొత్తం శుభాకాంక్షలు చెప్పింది. ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛాులు ఇచ్చింది. ఒక్క సల్మాన్‌ఖాన్‌ తప్ప.జాన్‌ జిగ్రీ దోస్తు ఎందుకు రాలేదని సంజయ్‌దత్‌ మధనపడ్డాడు. ఆరా తీస్తే తేలిందేమిటంటే రణ్‌ధీర్‌ కపూర్‌ సినిమాలో సంజయ్‌ దత్‌ నటించేందుకు సిద్ధపడటమేనని తేలింది. సంజయ్‌,రణ్‌ధీర్‌ సినిమాలో నటిస్తే తప్పేంటనుకుంటున్నారా!? సల్మాన్‌ ఖాన్‌ ప్రియురాు కత్రినాకైఫ్‌ను రణ్‌ధీర్‌ పెళ్లి చేసుకోబోతుండటమే కాకుండా, ఇద్దరిప్పుడు సహజీవనం చేస్తుండటమే. దాంతో సల్మాన్‌ఖాన్‌ విరోధుల జాబితాలో రణ్‌ధీర్‌ చేరిపోయాడన్నమాట. రణ్‌ధీర్‌తో సినిమా చేస్తుండటంతో సంజయ్‌కూడా శత్రువేనట!