రవి ఘంటా హీరోగా శారద ఆర్ట్స్ బ్యానర్ పై జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో కొత్త చిత్రం `కాళహస్తి` ప్రారంభం

Posted On:15-07-2016
No.Of Views:238

ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖా మంత్రి ఘంటా శ్రీనివాసరావు తనయుడు రవి ఘంటా హీరోగా ప్రశాంత్‌ సమర్పణలో శారద ఆర్ట్స్‌ బ్యానర్‌పై ప్రేమించుకుందాం..రా, ప్రమంటే ఇదేరా.., టక్కరి దొంగ, ఈశ్వర్‌, రావోయి చందమామ వంటి హిట్‌ చిత్రాల దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో అనిల్‌కుమార్‌ కిశన్‌ నిర్మాతగా కొత్త చిత్రం 'కాళహస్తి' గురువారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖా మంత్రి ఘంటా శ్రీనివాసరావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు, దగ్గుబాటి అభిరాం, ప్రముఖ నిర్మాత అశోక్‌ కుమార్‌, దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ, నిర్మాత అనిల్‌ కుమార్‌ కిశన్‌ తదితరులు పాల్గొన్నారు.

''మంచి కోసం దూసుకెళ్తా..ఎవడు అడ్డొచ్చినా తాటతీస్తా' అనే డైలాగ్‌ను ముహుర్తం షాట్‌గా చిత్రీకరించారు.

తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు క్లాప్‌కొట్టారు. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం......

మాటల రచయిత హర్షవర్ధన్‌ మాట్లాడుతూ - ''కాళహస్తి పేరు వినగానే భక్తిరస చిత్రం అనుకోవద్దు. మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. గుండె జారి గల్లంతయ్యిందే, మనం వంటి డిఫరెంట్‌ చిత్రాలు తర్వాత నేను మాటలు అందిస్తున్న మరో డిఫరెంట్‌ మూవీ ఇది. ఈ చిత్రం ద్వారా రవి ఘంటా హీరోగా పరిచయం అవుతున్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు తను. ఇదే ఎనర్జీ, కాన్ఫిడెంట్‌తో సినిమా పూర్తి అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ కృష్ణమాయ మాట్లాడుతూ - ``హీరో ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ కు పనిచేసిన అదే టీం ఇప్పుడు కాళహస్తికి వర్క్ చేస్తుంది. ఆ చిత్రంతో పరిచయమైన ప్రభాస్ ఇప్పుడు ఏ రేంజ్ ఉన్నాడో తెలిసిందే. అలాగే ఈ సినిమా హీరో కూడా మంచి స్టార్ గా ఎదుగుతాడు. మంచి యాక్షన్ సబ్జెక్ట్. టీం అందరికీ అభినందనలు`` అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ జవహర్‌ రెడ్డి యం.ఎన్‌. మాట్లాడుతూ - ''చాలా రోజుల తర్వాత మా టీం అంతా కలిసి చేస్తున్న సినిమా. గతంలో మేం కలిసి ప్రభాస్‌ ఇంట్రడక్షన్‌ మూవీ ఈశ్వర్‌ను చేశాం. అలాగే ఇప్పుడు మరో కొత్త హీరో రవిని పరిచయం చేస్తున్నాం. సినిమా మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. అందరికీ నచ్చే విధంగా ఉంటుంది'' అన్నారు.

కథా రచయిత ధీన్‌రాజ్‌ మాట్లాడుతూ - ''జయంత్‌గారికి ఈ సినిమా కథ కంటే ముందు ఎన్నో కథలను చెప్పాను. కానీ ఆయనకేవీ నచ్చలేదు. ఈ కథ వినగానే వెంటనే ఒప్పుకున్నారు. టైటిల్‌ కూడా మార్చలేదు. కథకు తగిన విధంగా కొత్త హీరోతో చేయాలని అనుకుంటున్న సమయంలో రవిని చూడటం, తనకి కథ చెప్పడం, తనకి నచ్చడంతో సినిమా చేయడం జరుగుతుంది. మంచి టీం కలిసి చేస్తున్న చిత్రమిది. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

చిత్ర దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''చాలా కథలు విన్నాను. అన్నీ నాకు రొటీన్‌గా అనిపించాయి. అప్పుడు ధీన్‌రాజ్‌గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. రియలిస్టిక్‌ కథ. సూపర్‌హీరో కథ కాదు. ఓ జెన్యూన్‌, రియల్‌ హీరో కథ వినగానే ఇలాంటి కథే నాకు కావాలనిపించింది. అలాంటి సమయంలోనే నేను రవిని కలిశాను. నా కథకు ఇలాంటి హీరోనే కావాలనుకున్నాను. సినిమా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. రవిలాంటి ఓ హీరోను పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఫీలవుతున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే ప్రేక్షకులను థ్రిల్‌ చేసే మంచి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ప్రదీప్ రావత్, ముఖేష్ రుషి, తనికెళ్ళ భరణి, పోసాని వంటి భారీ స్టార్ క్యాస్ట్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నెలాఖరున సినిమా షూటింగ్‌ను స్టార్ట్‌ చేస్తాం. వైజాగ్‌, కాళహస్తిలో ఎక్కువ భాగం చిత్రీకరిస్తాం. సాంగ్స్‌లో రెండు సాంగ్స్‌ను విదేశాల్లో చేసేలా ప్లాన్‌ చేశాం. రెండు మూడు షెడ్యూల్స్‌ లో సినిమాను పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

యంగ్‌ హీరో రవి ఘంటా మాట్లాడుతూ - ''ఇలాంటి మంచి సినిమాలో పార్ట్‌ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. జయంత్‌గారు, హర్షవర్ధన్‌గారు, ధీన్‌రాజ్‌గారు వంటి మంచి టెక్నిషియన్స్‌తో కలిసి పనిచేస్తున్నాను. నా డెబ్యూ మూవీని జయంత్‌గారి వంటి డైరెక్టర్‌తో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.

ప్రదీప్‌ రావత్‌, ముఖేష్‌ రిషి, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, ఐశ్వర్య, ఝాన్సీ, సత్యకృష్ణ, సమీర్‌ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: ప్రశాంత్, ఆర్ట్‌: కృష్ణమాయ, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, మాటలు: హర్షవర్ధన్‌, కథ: దీన్‌రాజ్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: జవహర్‌ రెడ్డి.యం.ఎన్‌, నిర్మాత: అనిల్‌ కుమార్‌ కిశన్‌, దర్శకత్వం: జయంత్‌ సి.పరాన్జీ.