గోపీచంద్ సరసన హన్సిక

Posted On:15-07-2016
No.Of Views:230

హన్సిక హన్సిక గోపీచంద్ కథానాయకుడిగా .. వైవిధ్యభరితమైన కథాంశంతో 'ఆక్సిజన్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకోవడంతో, గోపీచంద్ తదుపరి సినిమాకి రంగం సిద్ధమైపోతోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కథానాయికగా కేథరిన్ ను ఎంపిక చేసినట్టుగా ఇటీవల వార్తలు షికారు చేశాయి.
ఇక మరో కథానాయికగా హన్సికను తీసుకున్నారనేది తాజా సమాచారం. హన్సిక తెలుగు సినిమా చేసి చాలా కాలమే అయింది. రెండు సంవత్సరాల క్రితం ఆమె రవితేజతో 'పవర్' సినిమా చేసింది. ఆ తరువాత పూర్తిస్థాయి కథానాయికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. మళ్లీ ఇంత కాలానికి ఆమె తెలుగు సినిమాకి ఓకే చెప్పడం, ఇక్కడి అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే.