యూఎస్ మిక్స్ డ్ టైటిల్ అందుకున్న సానియా జోడీ..!

Posted On:06-09-2014
No.Of Views:362
యూఎస్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ ను తొలిసారి సానియా మీర్జా జోడీ కైవసం చేసుకుంది. యూఎస్ ఓపెన్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో టాప్ సీడ్స్ సానియా మిర్జా, బ్రూనో సోరెస్ లు 6-1, 2-6, 11-9 తేడాతో  అబిగెయిల్ స్పియర్, శాంటియాగో గోంజలెజ్ లపై విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకున్నారు.  తొలి సెట్ ను అవలీలగా కైవసం చేసుకున్న సానియా జోడీ..  రెండో సెట్ ను కోల్పోయింది. అయితే గేమ్ ను నిర్ణయించే మూడో సెట్ ను సానియా జోడీ తిరిగి కైవసం చేసుకుని యూఎస్ టైటిల్ ను ఎగురువేసుకుపోయారు. ఈ జోడీ సెమీఫైనల్లో యంగ్ జాన్ చాన్, రాస్ హచిన్స్ లపై ఘనవిజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.   యూఎస్ ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో ట్రోఫీని సొంతం చేసుకోవడం సానియాకు తొలిసారే అయినా.. ఇంతకుముందు రెండు సార్లు మిక్స్ డ్ విభాగంలో టైటిల్ సాధించింది. 2012 జూన్ 7 వ తేదీన ఇదే విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్  టైటిల్ ను కైవసం చేసుకున్న సానియా.. అంతకముందు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను కూడా తనఖాతాలో వేసుకుంది.