ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 35 అన్నా క్యాంటీన్లు : మంత్రి పరిటాల సునీత

Posted On:06-09-2014
No.Of Views:375
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 35 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆమె శనివారం శాసనసభలో మాట్లాడుతూ, తొలి దశగా రాష్ట్రంలో 35 ఎన్టీఆర్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామని అన్నారు.    అత్యధికంగా విశాఖపట్టణంలో 15 క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామని, అనంతపురంలో 5, గుంటూరులో 10, తిరుపతిలో 5 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.    తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లను మంత్రి సనీత స్వయంగా పరిశీలించిన విషయం తెల్సిందే. ఇదే తరహాలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు కూడా అనుమతిచ్చిన విషయం తెల్సిందే.