రేవంత్ రెడ్డి బోగోతాల సీడీలు మా వద్ద ఉన్నాయ్ : టీఆర్ఎస్ నేతలు!

Posted On:06-09-2014
No.Of Views:405
తెలుగుదేశం పార్టీకి చెందిన యువనేత రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా ప్రతినిధిగా రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని ఆరోపించారు. ఆయన బోగోతాలకు చెందిన సీడీలు తమ వద్ద ఉన్నాయన్నారు. శనివారం హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కరీoనగర్ ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మర్రి జనార్థన్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో రేవంత్ రెడ్డి చేసిన పలు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.    పలు కేసుల్లో నిందితులతో రేవంత్కు సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. త్వరలో రేవంత్ బండారం బయటపడతామని వారు హెచ్చరించారు. కొడంగల్ ప్రజా కోర్టులో చర్చకు సిద్ధమా అంటూ రేవంత్కు సవాల్ విసిరారు. మెదక్ ఉపఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని వారు జోస్యం చెప్పారు.    ఇకపోతే తమ పార్టీ నేత కేటీఆర్ ఆంధ్రానేతలతో కలిసి వ్యాపారం చేస్తే తప్పేంటన్నారు. దీన్ని రాద్ధాంత చేయడం తగదని హితవు పలికారు. రేవంత్రెడ్డి కాంట్రాక్టర్ను బెదిరించి డబ్బు వసూల్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్పై చేసిన విమర్శలను వెంటనే నిరూపించాలని రేవంత్రెడ్డిని డిమాండ్ చేశారు.