నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటో..!

Posted On:08-09-2014
No.Of Views:363
హైదరాబాద్: వినాయకుడ్ని హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి తీసుకువెళ్తున్న ఆటో ట్రాలీ సోమవారం ఎంజే మార్కెట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు సృహా కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయాపడ్డారు. దాంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనలో వినాయకుడి విగ్రహాం ధ్వంసమైంది. డ్రైవర్ ఆటోను మలుపు తిప్ప బోయారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.