యూఎస్ ఓపెన్ లో 'హ్యాట్రిక్' సాధించిన సెరెనా..!

Posted On:08-09-2014
No.Of Views:347
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ‘హ్యాట్రిక్’ సాధించింది. వరుసగా మూడోసారి టైటిల్ చేజిక్కించుకుంది. సొంతగడ్డపై జరిగిన తుదిపోరులో స్నేహితురాలిని ఓడించి కెరీర్ లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది ఈ నల్లకలువ. ఆదివారం అర్థరాత్రి దాటిన జరిగిన తర్వాత ఫైనల్లో డెన్మార్క్ భామ కరోలైన్ వొజ్నియాను వరుస సెట్లలో ఓడించింది. 6-3, 6-3తో వొజ్నియాను కంగుతినిపించింది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న తొలి ‘గ్రాండ్‌స్లామ్’ టైటిల్ అందుకోవాలనుకున్న వొజ్నియా ఆశలపై నీళ్లు చల్లింది. కాగా, ఇదే టోర్నీలో 2011లో రన్నరప్‌గా నిలిచిన సెరెనా 2012, 2013లలో విజేతగా నిలిచింది.