బాలాపూర్ గణపతి లడ్డూను దక్కించుకున్న సింగిరెడ్డి జైహింద్ రెడ్డి

Posted On:08-09-2014
No.Of Views:417
బాలాపూర్ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన వినాయకుడి లడ్డూని రికార్డు స్థాయిలో 24 మంది వేలంపాటలో పేర్లు నమోదు చేసుకున్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి హాజరయ్యారు . గత ఏడాది తెదేపా నేత తీగల కృష్ణారెడ్డి 9. 26 లక్షలకు దక్కించుకున్నారు . ఈ సారి వేలం పాటలో బాలాపూర్ కి చెందిన సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9. 50 లక్షలకు రికార్డు స్థాయిలో దక్కించుకున్నాడు . వేలంపాటలో వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధి కోసం వినియోగించనున్నారు . లడ్డూ దక్కించుకున్నదుకు తనకు చాలా సంతోషంగా వుందని జైహింద్ రెడ్డి తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంపిటిసి తీగల విక్రమ్ రెడ్డి,  కొత్త మనోహర్ రెడ్డి , దైవజ్ఞ శర్మ , అచ్చంపేట్ ఎం ఎల్ ఎ  గువ్వల బాలరాజు మరియు బిజెపి నేత శంకర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు .  1994 - రూ .450  1995 - .రూ. 4,500  1996 - రూ.18,000  1997 - రూ.28,000  1998 - రూ.51,000  1999 - రూ.65,000  2000 - రూ.66,000  2001 - రూ.85,000  2002 - రూ.1,05,000  2003 - రూ.1,55,000  2004 - రూ.2,01,000  2005 - రూ.2,08,000  2006 - రూ.3,00,000  2007 - రూ.4,15,000  2008 - రూ.5,07,000  2009 - రూ.5,10,000  2010 - రూ.5,35,000  2011 - రూ.5,45,000  2012 - రూ.7,50,000  2013 - రూ.9,26,000  2014 - రూ.9,50,000