వెస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ సినీ స్టూడియో?

Posted On:10-09-2014
No.Of Views:364
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సినీ స్టూడియో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో, ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల చూపు పక్క జిల్లాలపై పడినట్లు తెలుస్తోంది. అక్కడైతే తమకు కావల్సిన భూములు తక్కువ ధరకు లభిస్తాయని కానుక అటువైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నర్సాపురం- పైడిపాలెం ప్రాంతాల మధ్య స్టూడియో నిర్మించడానికి కావల్సిన భూమిని సేకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముందుగానే మాట్లాడి ఓకే చేయించుకున్నారట. అలాగే రాజధాని పక్క జిల్లాలలో స్టూడియో నిర్మిస్తే అన్నివిధాల అనుమతుల దగ్గర నుంచి రకరకాల ప్రోత్సాహాకాలు లభిస్తాయని పవన్ ముందుగానే ఆలోచించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలలో టిడిపితో కలిసి పవన్ కళ్యాణ్ పనిచేశారు కాబట్టి ఆయనకు ఎన్ని ఎకరాలు కావాలన్న ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరాలు వుండకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన స్వంత డబ్బుతోనే స్థలాలను కొనుగోలు చేసి భవిష్యత్త్ లో ఎవరూ వేలెత్తి చూపకుండా వుండే విధంగా స్టూడియో నిర్మించాలని భావిస్తున్నారట. దీనిపై రానున్న రోజుల్లో పవన్ అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు.