తెలంగాణలో కొత్త జిల్లాలు.. 10 నుంచి 24కి...!

Posted On:10-09-2014
No.Of Views:407
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న 10 జిల్లాలను విభజించి మొత్తం 24 జిల్లాలుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. హైదరాబాద్ జిల్లా: చార్మినార్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్, రంగారెడ్డి జిల్లా: వికారాబాద్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి, వరంగల్ జిల్లా: వరంగల్, భూపాలపల్లి, జనగాం, మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్ జిల్లా: మంచిర్యాల, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లా: కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ జిల్లా: సూర్యాపేట, నల్లగొండ, మెదక్ జిల్లా: సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లా: కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగా విభజించనున్నారు. నిజామాబాద్ జిల్లాను నిజామాబాద్‌ జిల్లాగానే వుంచుతూ, ఈ జిల్లాలోని కామారెడ్డి డివిజన్‌ను కొత్తగా ఏర్పడబోయే సిద్దిపేట జిల్లాలో కలుపుతారు.