శ్వేతా బసు చేస్తే తప్పేముంది...? దీపికా పదుకునె

Posted On:13-09-2014
No.Of Views:375
శ్వేతా బసు వ్యభిచారం చేస్తూ పట్టుబడిందన్న విషయంపై టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై బాలీవుడ్ నటి దీపికా పదుకునె స్పందించింది. తన కుటుంబాన్ని ఆదుకునే మార్గమూ, తనను తాను నిలదొక్కుకునే మార్గమూ అదొక్కటే అని శ్వేతా బసు భావించినట్లయితే ఆ మార్గం ఆమె ఎంచుకోవడంలో తప్పేముందంటూ ప్రశ్నించింది.    డబ్బు సంపాదనకు ఆమెకు కనబడిన మార్గము అదొక్కటే అయినపుడు దాన్ని తప్పు అని ఎలా అంటారంటూ ప్రశ్నించింది దీపిక. అంతా శ్వేతా బసు సెక్స్ స్కాండల్ అంటూ సంబోధించడం అర్థరహితమనీ, ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. ఆమెకు సహాయం చేయాల్సిందిపోయి  ఆమె మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం విచారకరమని దీపికా వ్యాఖ్యానించింది. మరో నటి రాణీ ముఖర్జీ మాత్రం శ్వేతా బసు అంశంపై తాను స్పందించలేనని చెప్పారు.    ఇంకా మన టాలీవుడ్ నుంచి రాంగోపాల్ వర్మ కూడా వివరాలు పూర్తిగా తెలియకుండా నేనేమీ మాట్లాడను అంటూ ముగించారు. ఇంకా మంచు విష్ణు మాత్రం తన తదుపరి చిత్రంలో ఖచ్చితంగా శ్వేతా బసుకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు. మొత్తమ్మీద 11 ఏళ్ల వయసులో బాలనటిగా జాతీయ అవార్డును గెలుచుకున్న శ్వేతా బసు నటిగా మాత్రం అవకాశాలు లేక ఇలా వ్యభిచారం చేస్తూ దొరికిపోవడంపై భారతదేశ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులను కదిలిస్తోంది.