అదిలాబాద్‌ జిల్లాలో ఎదురుకాల్పులు

Posted On:14-09-2014
No.Of Views:380
ఆదిలాబాద్‌ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతంలో పోలీసులకు- మావోయిస్టులకు మధ్య ఎదరుకాల్పులు జరిగాయి. తిర్యాణి మండలం, పంగిడిమాదిర గ్రామ సమీప అడవీ ప్రాంతంలో గ్రేహ్యాండ్స్‌ దళాలు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని, ప్రతిగా కాల్పులు జరిపామని, సుమారు 20 నిముషాలపాటు జరిగాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, సంఘటనా ప్రాంతంలో కొన్ని కిట్‌ బ్యాగులు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్‌పీ భూపాల్‌ ధృవీకరించారు.