మహేష్ బాబు కటౌట్ కలకలం - కాల్వలోకి దూకిన అభిమాని

Posted On:14-09-2014
No.Of Views:439
'ఆగడు' సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో, మహేశ్ బాబు కటౌట్ ఏర్పాటు చేసిన అభిమానులకు అధికారుల తీరు ఆగ్రహం తెప్పించింది. విజయవాడ అలంకార్ సెంటర్లో 90 అడుగుల కటౌట్ ను ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. దీనిపై అధికారులు అభ్యంతరం తెలిపారు. అనుమతి లేదంటూ తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత నెలకొంది.    అధికారులకు, మహేశ్ బాబు అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ అభిమాని కటౌట్ పైనుంచి కాల్వలోకి దూకాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని కాపాడారు.   కాగా, మహేష్ బాబు, తమన్నా నటించిన 'ఆగడు' సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఆగడు చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. దర్శకుడు శ్రీనువైట్ల.