మంత్రుల చిట్టా విప్పనున్న చంద్రబాబు..!

Posted On:15-09-2014
No.Of Views:326
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... మంత్రుల పనితీరుపై గ్రేడింగ్ ఇవ్వనున్నారు. రాష్ట్ర కేబినెట్ సోమవారం ఉదయం పది గంటలకు సమావేశం కానుంది. ఈ సందర్భంగా వివిధ శాఖల వందరోజుల ప్రణాళికలపై చంద్రబాబు సమీక్షించనున్నారు.అలాగే రాజధానిపై భూసేకరణకు సంబంధించి విధివిధానాలపై కేబినెట్ చర్చించనుంది. దీనితో పాటు ఎన్టీఆర్ సుజల స్రవంతి, ఫించన్ల పెంపుపై రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకోనుంది.