ఐరాస అసెంబ్లీలో హిందీలో ప్రసంగించనున్న మోడీ..!

Posted On:15-09-2014
No.Of Views:372

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యూయార్క్‌‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో హిందీలో ప్రసంగించనున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాద్ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. హిందీ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ విషయం ప్రకటించారు. సాధారణంగా ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొనే ఆ సమావేశంలో అందరూ ఆంగ్లంలోనే ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి హాజరైన భారత ప్రధానులు కూడా ఆంగ్లంలోనే ప్రసంగించారు. అయితే అందరికంటే భిన్నంగా వ్యవహరించే నరేంద్ర మోడీ, ఆ సమావేశంలో హిందీలో ప్రసంగించేందుకు నిర్ణయించుకున్నారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. గతంలో ఐక్యరాజ్యసమితి సమావేశంలో హిందీలో మాట్లాడిన తొలి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి అని గుర్తు చేశారు.