ఝార్ఖండ్‌, కశ్మీర్‌లలో రెండో విడత పోలింగ్‌ ప్రారంభం

Posted On:01-12-2014
No.Of Views:357

ఝార్ఖండ్‌, జమ్ము`కశ్మీర్‌ రాష్గాల శాసనసభలకు రెండో దశ ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రెండు రాష్గాల్లోనూ అతివాద వర్గాల ప్రాబల్యం ఉండడంతో విస్తృతంగా బలగాలను మోహరించారు. రaార్ఖండ్‌లో ఎన్నికలు జరుగుతున్న 20 స్థానాలు మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఈ దశ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 223 మందిలో మాజీ ముఖ్యమంత్రులు అర్జున్‌ ముండా, మధు కోడా వంటి ప్రముఖులు ఉన్నారు. జంషెడ్‌ఫతిర్‌ (పశ్చిమ) నియోజకవర్గంలో గరిష్ఠంగా 15 మంది బరిలో దిగారు. ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా (జేవీఎం`ప్రజాతాంత్రిక్‌), తృణమూల్‌ కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి. గతంలో ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడిపిన జేఎంఎం, కాంగ్రెస్‌ ఈసారి విడివిడిగా బరిలో దిగాయి. మొత్తం మీద 40 వేల మంది భద్రత సిబ్బందిని బందోబస్తు నిమిత్తం వినియోగిస్తున్నారు. జంషెడ్‌పూర్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్న తర్వాత రసీదును కూడా ఇస్తారు. ఆ రెండు చోట్ల ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతుంది. మిగిలిన చోట్ల మధ్యాహ్నం 3 గంటలకే ముగుస్తుంది. కొల్హన్‌ ప్రాంతంలో ఉన్న 20 స్థానాల్లో విజయం సాధించడం లక్ష్యంగా భాజపా తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రభృతులు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ తరఫున పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ఎంపీ రాజ్‌బబ్బర్‌ ప్రభృతులు ప్రచారంలో పాల్గొన్నారు. నవంబరు 25న తొలిదశలో 13 స్థానాలకు ప్రశాంతంగా జరిగిన ఎన్నికల్లో 62% మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
జమ్ము బరిలో 55 మంది కోటీశ్వరులు: ,జమ్ము`కశ్మీర్‌ రాష్ట్రంలో 18 స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 275 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వారిలో 55 మంది కోటీశ్వరులున్నారు. 97 మంది అభ్యర్థులు పట్టభద్రులు కారు. 9 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులున్నాయి. తొమ్మిది మంది అభ్యర్థులు నిరక్షరాస్యులనిm (ఎ.డి.ఆర్‌.) వెల్లడిరచింది. 11 మంది అభ్యర్థులు తమకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని ప్రకటించడం విశేషం. రెండోదశ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నవారిలో నలుగురు మంత్రులు, ఉప సభాపతి, 11 మంది ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నారు. తీవ్రవాద, విచ్ఛిన్నకర శక్తుల నుంచి ఎలాంటి అంతరాయం లేకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడిరచాయి. నూరాబాద్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 15 మంది బరిలో దిగగా మిగిలిన చోట్ల బహుముఖ పోటీ నెలకొంది. భాజపా అభ్యర్థుల తరఫున ప్రధాని మోదీ రెండు సభల్లో ప్రసంగించారు. మిగిలిన పార్టీలూ విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. తొలిదశలో 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 71% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడంతో రెండో దశకు సంబంధించిన ప్రచారం మరింత వేడిగా కొనసాగింది. రెండు రాష్గాల్లో 3, 4, 5వ దశల ఎన్నికలు ఈ నెల 9, 14, 20 తేదీల్లో జరగనున్నాయి. 23న ఓట్ల లెక్కింపు చేపడతారు.