పెట్టుబడులు ఖాయం : చంద్రబాబు

Posted On:01-12-2014
No.Of Views:343

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి జపాన్‌ ప్రభుత్వంతో పాటు, అక్కడి ప్రయివేటు సంస్థలతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడిరచారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులకు తన పర్యటన విశేషాలను వివరించారు. తన యాత్ర విజయవంతమయిందని, భవిష్యత్తులో చాలా పరిశ్రమలు రానున్నాయని చెప్పారు. వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టులు వచ్చేందుకు ఏమి చేయాలనేదానిపై జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పరిపాలనలో సింగపూర్‌, సాంకేతిక పరిజ్ఞానంలో జపాన్‌ అత్యున్నత దేశాలని, ఆ రెండూ కలిస్తే అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఆ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతిష్ఠ పెంచేలా రాజధాని: తెలుగువారి ప్రతిష్ఠపెంచేలా రాజధాని ఉండాలి. బృహత్‌ ప్రణాళిక రూపొందించాలని సింగపూర్‌ ప్రభుత్వాన్ని కోరాం. అందుకోసం ఈ నెల 8న సింగపూర్‌ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్‌ రాష్గానికి వస్తున్నారు. సింగపూర్‌తో పాటు జపాన్‌ కూడా రాజధాని నిర్మాణంలో భాగస్వామవుతుంది. రాజధానికి భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగానే ఉన్నారు. ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియాకు మాత్రమే ఇష్టం లేదు. రాజధానిని అడవుల్లో ఏర్పాటు చేయాలని వారు సూచించారు. రైతులు ఇప్పుడు ఆశిస్తున్న ధర కంటే మంచి ధర వస్తుంది. ఎవరూ భూములు అమ్ముకోవద్దు. టోక్యోలో భూమి విలువ గజాల లెక్కన కాకుండా అంగుళాల లెక్కన కడుతున్నారు. ఇక్కడా అలాంటి పరిస్థితి రావొచ్చు.హైదరాబాద్‌లా అభివృద్ధి: 2004లో మేం ఓడిపోయిన కొద్దికాలానికి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అమెరికా వెళ్లారు. మా దేశంలో హైదరాబాద్‌ వంటి ప్రపంచస్థాయి నగరాలున్నాయని చెప్పారు. ఆ అభివృద్ధి చేసిందెవరు? ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఆస్ట్రేలియా వెళ్లి హైదరాబాద్‌ నగరం గురించి మాట్లాడారు. ఆ నగరం అభివృద్ది చెందింది మా హయాంలో కాదా? అలాంటి నగరం కావాలంటే అందరి భాగస్వామ్యం కావాలి. ఇదంతా సవ్యంగా సాగితే నాకు పేరొస్తుందనే అక్కసుతో కొన్ని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి.
బౌద్ధ క్షేత్రాల పర్యాటకం: బౌద్ధం పుట్టింది భారత్‌లోనేనని, ఆచార్య నాగార్జునుడు ఆ మతాన్ని జపాన్‌ దేశానికి తీసుకొచ్చారని అక్కడివారు చెప్పారు. నాగార్జునుడి పేరిట ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయం ఉండడం అద్భుతమని వారు అన్నారు. బౌద్ధ సర్క్యూట్‌ను ఏర్పాటుచేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం.రాష్ట్రంలో జపనీస్‌ డెస్క్‌: ఆ దేశ ప్రతినిధుల కోసం రాష్ట్రంలో జపనీస్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తాం. జపనీస్‌ భాష వచ్చినవారినే నియమిస్తాం. అనుమతుల మంజూరులో జరిగే జాప్యంపైనే జపాన్‌ పారిశ్రామికవేత్తలు ఫిర్యాదులు చేశారు. ఆ ఇబ్బందులు అన్నింటినీ అధిగమించడానికి ఈ ప్రత్యేక డెస్క్‌ పనిచేస్తుంది. అనుమతులు ఇప్పించే బాధ్యతలు తీసుకుంటుంది.జపనీయులు కష్టజీవులు. వారి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రహదారుల మీద ఎక్కడా చెత్త కనిపించదు. ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా కొన్ని సంస్కరణలపై ప్రజామోదం కోసం ప్రధాని అబే ఇప్పుడే ఎన్నికలకు వెళ్తున్నారు. తీరికలేని పనులున్నా సమయం కేటాయించారు. వెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని, శాలువాను ఆయనకు బహూకరించాం. ఆ శాలువాతోనే ఎన్నికల ప్రచారానికి వెళ్తానని ఆయన అన్నారు.మన మీద వారికే నమ్మకం ఎక్కువ: 2050నాటికి చెjనా, భారత్‌లే అభివృద్ధి చెందిన దేశాలవుతాయని సాఫ్ట్‌బ్యాంక్‌ ా’jర్మన్‌ సోన్‌ అంచనా వేశారు. గతంలో నేను విజన్‌`2020 అంటే అందరూ నవ్వారు. కానీ సోన్‌ వచ్చే 300 ఏళ్లకు విజన్‌ రూపొందించి దాన్ని సాధించడానికి నాయకత్వాన్ని తయారు చేస్తున్నారు. మనమీద మనకు నమ్మకం లేదు, కానీ...మనపై అందరికీ నమ్మకముంది.ఇప్పటికిప్పుడు ఏవి వచ్చాయని కాకుండా, భవిష్యత్తుపై దృష్టి పెట్టాను. ముందుగా జపాన్‌ నుంచి పది కంపెనీలు తీసుకొస్తే, నమ్మకం కుదిరి క్రమంగా 90 వస్తాయి. రాష్ట్ర రెవిన్యూ లోటు ఈ ఏడాది రూ.15వేల కోట్లు ఉంది. ఈ పరిస్థితుల్లో ఆదాయం పెంచుకోవాలి. లేకుంటే అప్పు చేయాలి. కాదంటే అభివృద్ధి ఆపేయాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చడం, రాజధాని నిర్మాణం కోసం పనిచేస్తున్నా. జపాన్‌లో అర్థరాత్రి 12 గంటల వరకు సమావేశాల్లో ఉండి, మళ్లీ ఉదయం 7.30కే బయల్దేరేవాళ్లం.ఐటీ రంగంలో మనవాళ్లు: జపాన్‌లో 23వేల భారతీయ కుటుంబాలు ఉంటే వాటిలో 300 ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి. మీలో ఐటీ ఉద్యోగులు చేతులెత్తాలని అడిగినప్పుడు 80`85శాతం మంది చేతులెత్తారు. విలేకరుల సమావేశంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, సీఎం కార్యాలయ అధికారి సతీష్‌చంద్రలు పాల్గొన్నారు.