గాంధీ ఆస్పత్రిలో రోగికి అనుమానిత వైరస్‌?

Posted On:01-12-2014
No.Of Views:301

 హైదరాబాద్‌: నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి అనుమానిత వైరస్‌తో గాంధీ ఆస్పత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. కొంతకాలంగా నైజీరియాలో పనిచేసిన ఆయన... ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. ఇంట్లో ఉండగా తీవ్ర జ్వరం రావడంతో నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో గతనెల 24న చేరారు. అక్కడ రెండు రోజులు చికిత్స తీసుకున్నా నయం కాలేదు. దీంతో ఆయనకు స్వైన్‌ఫత్లి లేదా ఎబోలా లక్షణాలు ఉండవచ్చని భావించి, అక్కడి నుంచి గాంధీకి తరలించారు. కాగా, రోగి రక్త నమూనాలను దిల్లీకి పంపినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.