కేసీఆర్‌ అయుత చండీయాగం

Posted On:01-12-2014
No.Of Views:310

వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్‌ అయుత చండీయాగం చేయనున్నారు. మెదక్‌ జిల్లా జగదే వ్‌పూర్‌ మండలం ఎర్రవల్లి గ్రామ శివారులో గల తన ఫాంహౌస్‌లో ఈ యాగం చేయడానికి నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఆయన శృంగేరి పండితులతో కలిసి స్థల పరిశీలన చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. అయుత చండీయాగ నిర్వహణపై కేసీఆర్‌ గత కొన్ని నెలలుగా వేద పండితులతో చర్చిస్తున్నారు. శృంగేరి పండితులను ఫణి శంకర శర్మ, గోపీకృష్ణ శర్మలను సోమవారం ఫాంహౌస్‌కు తీసుకువచ్చారు. వారిరువురూ కేసీఆర్‌తో కలిసి ఫాంహౌస్‌లో స్థల పరిశీలన చేసి, అక్కడ భవనం పక్కన గల స్థలంలో యాగం చేయడానికి నిర్ణయించినట్లు తెలిసింది.