బొల్లారంలో ఈనెల 24 నుంచి 31 వరకు విడిది

Posted On:01-12-2014
No.Of Views:329

 రంగారెడ్డిజిల్లా): శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈనెల 24న హైదరాబాద్‌ రానున్నారు.బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన ఈనెల 31వ తేదీ వరకు విడిది చేస్తారు. హైదరాబాద్‌లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లకు సంబంధించి ఉన్నతస్థాయి అధికారులు నేడు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రక్షణశాఖ, పోలీస్‌, రెవెన్యూ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని ముస్తాబు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.