అడ్డదిడ్డంగా కంటి ఆపరేషన్లు: 15 మందికి చూపు పోయింది..!

Posted On:04-12-2014
No.Of Views:384

చూపు సరిగా కనిపించడం లేదని గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరానికి వెళ్తే డాక్టర్లు, గుడ్డివాళ్లను చేసేశారు. ఇదెక్కడ జరిగిందంటారా! పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ జిల్లా గాగోమహల్‌ గ్రామంలో జరిగింది. గురునానక్‌ ఛారిటబుల్‌ ట్రస్టు అనే ఎన్జీఓ ఈనెల 5`16 మధ్యన నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఇక్కడ 62మందికి చూపు సరిగా ఆనడం లేదని,శస్త్ర చికిత్సలు అవసరమని భావించి గురుదాస్‌పూర్‌కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు శస్త్ర చికిత్సలకు బదులు ఉన్న కళ్లను పీకేసి శాశ్వతంగా గుడ్డివాళ్లను చేసేశారు. ఈ పదిహేను మంది అమృత్‌సర్‌ డిప్యూటీ కమిషనర్‌కు డాక్టర్లపైనా, ఎన్జీఓపైనా ఫిర్యాదు చేశారు. ప్రస్థుతం కేసు విచారణలో ఉంది.