కడుపు చేస్తే...యాభైవేల జరిమానా

Posted On:04-12-2014
No.Of Views:383

పదహారు ఏళ్ల మైనర్‌ బాలికను రేప్‌ చేశాడో ప్రబుద్ధుడు. ఆమెను బెదిరిస్తూ తరచూ అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా చివరకు గర్భిణీని చేశాడు. అతగాడి నిర్వాకం డాక్టర్‌ వద్దకు ఆమెను పరీక్ష చేయించినప్పుడు బయటపడిరది. వెంటనే అక్కడి పెద్దలు పంచాయితీ నిర్వహించి అత్యాచారం చేసిన మృగాడికి యాభైవేల రూపాయల ఫైన్‌ వేసింది. ఈ మొత్తం అబార్షన్‌ చేయించుకోవడానికి హాస్పిటల్‌ ఖర్చు ఇది.ఇది ఎక్కడ జరిగిందంటారా? బీహార్‌ రాష్ట్రం కిషన్‌గంజ్‌ జిల్లా దిక్తత్‌ గ్రామంలో జరిగింది. బాధితురాలు తనకు అతనితో పెళ్లి చేసి, న్యాయం చేయాలని పంచాయితీ పెద్దలను కోరినా అక్కడి గోడు పట్టించుకునేవారెవరు? అయితే పోలీసులు జోక్యం చేసుకొని, రేప్‌ చేసిన వ్యక్తిపై, పంచాయతీ చేసిన పెద్దలపై కేసు  పెట్టారు.