మైనార్టీలకు బిజెపి గాలం?

Posted On:04-12-2014
No.Of Views:341

పశ్చిమబెంగాల్‌ మాదేనంటూ విర్రవీగిన కమ్యూనిస్టుల కోటను బద్ధలుకొట్టిన మమతా బెనర్జీ పార్టీని ఎలాగైనా దెబ్బ తీయాలని బిజెపి రంగంలోకి దిగింది. బిజెపి సర్కార్‌పైనే సవాళ్లు విసిరిన మమతాబెనర్జీని రాజకీయంగానే దెబ్బ తీసేందుకు కాషాయపార్టీ ఒక్కసారిగా మైనార్టీలపైన ప్రేమను కురిపిస్తోంది. మమతా బెనర్జీ సారధ్యం వహిస్తున్న తృణమూల్‌ కాంగ్రెస్‌కు మైనార్టీలే పెద్ద అండ. రాష్ట్రంలో 27శాతం మంది మైనార్టీల అండదండలు పార్టీల గెలుపూ ఓటములను ప్రభావితం చేస్తాయి. అందుకే తృణమూల్‌ను  కుప్పకూల్చేందుకు మైనార్టీ వర్గాలకు బీజెపి తాయిలాలు పంచిపెడుతుంది. ఇప్పటి వరకు 2.5లక్షల మైనార్టీ సభ్యత్వాలను సేకరించామని,త్వరలో రెండుకోట్లను చేరుకుంటామని బిజెపి ముఖ్యనాయకులు చెబుతున్నారు. మరి మమతక్క ఏం చేస్తున్నట్టో..?