నాసా మానవ రహిత ఆరియన్‌ ప్రయోగం విజయవంతం

Posted On:05-12-2014
No.Of Views:370

అంగారక గ్రహంపైకి మనుష్ళలను తీసుకెళ్లే దిశగా అమెరికా చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతమైంది. తొలి మానవ రహిత వాహకరీ।క ఆరియన్‌ ప్రయోగం సఫలీకృతమైంది. భవిష్యత్తులో అంగారకుని పైకి మానవులను పంపే దిశగా నాసా తొలి అడుగు వేసినట్లైంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 7.05 గంటలకు (భారత్‌లో సుమారు రాత్రి 7.30గంటలు) ఆరియన్‌ నింగిలోకి దూసుకెళ్లి, నిర్దేశిత భూకక్ష్యలోకి ప్రవేశించింది. ఆరియన్‌లో నలుగురు వ్యోమగాములు ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వేడి తాపడం, పారాస్యూట్స్‌, జెట్టీస్కానింగ్‌ పరికరాలు ఇందులో ఉన్నాయి. 2021లో నలుగురు వ్యోమగాములను అంగారక గ్రహంపైకి పంపాలని నాసా యోచిస్తోంది. 2030లో మనుష్ళలను అంగారక గ్రహంపైకి పంపే యత్నాల్లో నాసా ఉంది.