ఈ ఏటి మేటి ఆసియన్‌గా మోదీ

Posted On:05-12-2014
No.Of Views:343

ఈ ఏటి మేటి ఆసియాన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపికయ్యారు. సింగపూర్‌కు చెందిన దినపత్రిక ‘ది స్ట్రెయిట్స్‌ టైమ్స్‌’ ఈ మేరకు ప్రధాని మోదీని ఎంపిక చేసింది. అభివృద్ధి దృష్టి ఉన్న నేతగా, పొరుగు దేశాలతో సత్సంబంధాల నెలకొల్పడంలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించింది. రాజకీయంగా, సామాజికంగా మోదీ దేశాన్ని శక్తిమంతం చేశారని పేర్కొంది. ఏడాది కాలంలో ఆసియా ఖండంలో కానీ, వారి దేశంలో కానీ విశేష ప్రభావాన్ని చూపిన ఆసియాకు చెందిన వ్యక్తుల్ని సింగపూర్‌ దినపత్రిక 2012 నుంచి ఒకరిని ఎంపిక చేస్తోంది. ఈ ఏడాది నరేంద్ర మోదనీ ఎంపిక చేసింది. ప్రధాని పదవికి నరేంద్ర మోదీ కొత్త అయినప్పటికీ, ఆసియాలో తనదైన ముద్ర ఏర్పరచుకున్నారని ఆ పత్రిక ప్రశంసించింది. ప్రధాని మోదీ వెసులుబాటును బట్టి ఆయనకు అందజేయాలనుకుంటున్నట్లు ‘ది స్ట్రెయిట్స్‌ టైమ్స్‌’ విదేశీ సంపాదకుడు రవి వెల్లూర్‌ తెలిపారు. ఈ పురస్కారాన్ని గతేడాది సంయుక్తంగా చెjనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే అందుకున్నారు. 2012లో మయన్మార్‌ అధ్యక్షుడు థీన్‌సేన్‌కు అందజేశారు.