పాఠశాలల్లో లైంగిక వేధింపులపై స్పందన తెలపండి

Posted On:05-12-2014
No.Of Views:342

దిల్లీ: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)పై సుప్రీం కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ‘‘ఇది మంచి ఆశయంతో దాఖలైన పిల్‌. వీటిపై నోటీసులు జారీ చేస్తున్నాం’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.ఎల్‌.దత్తు, జస్టిస్‌ ఎ.కె.సిక్రి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. పాఠశాలలు, ఇతర ప్రదేశాల్లో చిన్నారులపై ఇలాంటి అకృత్యాలు జరగకుండా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ వినీత్‌ కోరారు. ఇలాంటి కేసుల్లో విద్యా సంస్థలను జవాబుదారుగా చేసేందుకు ఎలాంటి మార్గదర్శకాలు కానీ చట్టాలు కానీ లేవని పేర్కొన్నారు. విద్యార్థులపై లైంగిక వేధింపులను అడ్డుకోవడానికి మార్గదర్శకాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.