పుట్టపర్తిలో విదేశీయుడి ఆత్మహత్య

Posted On:05-12-2014
No.Of Views:344

 అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శుక్రవారం రాత్రి ఓ విదేశీయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. డీఎస్పీ శ్రీనివాసులు కథనం మేరకు.. రష్యాలోని పీటర్స్‌బర్గ్‌కు చెందిన కుచ్‌మిస్త్రీ వ్లాదిమిర్ (36) తల్లి కెలోడినా గత ఏడాది పుట్టపర్తిని సందర్శించి చిత్రావతి గుట్టమీద ఉన్న ప్రశాంతి హిల్‌వీవ్ అపార్ట్‌మెంట్‌లోని 803 (8వ ఫ్లోర్) నంబర్ గదిని లీజుకు తీసుకుంది.
4 నెల ల క్రితం ఆమె స్వదేశానికి వెళ్లిపోయింది. ఈ ఏడాది అక్టోబర్ 28న వ్లాదిమిర్‌కు భారత ప్రభుత్వం వీసా మంజూరు చేయడంతో నవంబర్ 26న ఆయన పుట్టపర్తికి వచ్చి తల్లి గదిలోనే ఉండేవాడు. శుక్రవారం రాత్రి తన గదిలోని కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.