అతిపెద్ద స్థూలకాయుడి మృతి

Posted On:06-12-2014
No.Of Views:362

లండన్‌: ప్రపంచంలోనే అతిపెద్ద స్థూలకాయునిగా విశ్వసిస్తున్న బ్రిటన్‌ పౌరుడు కీత్‌ మార్టిన్‌(44) మృతి చెందారు. 444.52 కేజీల బరువుతో ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. మార్టిన్‌ కొంతకాలంగా వూపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. భారీ శరీరాకృతి, అత్యధిక బరువుతో ఆయన తీవ్రంగా సతమతమయ్యారు. సుమారు 8 నెలల క్రితమే తన భారీకాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యులు కీత్‌ జీర్ణాశయంలోని మూడొంతుల భాగాన్ని తొలగించి, చిన్నగా కుదించారు.