దేవుడు నన్ను మోసం చేశాడూ...

Posted On:06-12-2014
No.Of Views:326

పెద్ద కుమారుడు జానకిరామ్ మరణవార్త వినగానే ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ 'దేవుడు నన్ను మోసం చేశాడంటూ' విలపిస్తూ కుప్పకూలి పోయారు. తన కుటుంబానికే ఇలా ఎందుకు జరగుతుందంటూ తీవ్ర ఆవేదన చెందారు. హరికృష్ణను ఓదార్చడం అక్కడే ఉన్న కుటుంబసభ్యులు, బంధువుల తరం కాలేదు. కుటుంబ సభ్యులతోపాటు జానకిరామ్ భార్య, పిల్లల తీవ్ర దుఖఃసాగరంలో మునిగిపోయారు.జానకిరామ్ మరణవార్త విన్న వెంటనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు హరికృష్ణ నివాసానికి  చేరుకున్నారు. నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు, పలు రాజకీయ పార్టీల నాయకులు, బాబు కేబినెట్ లోని మంత్రులు హరికృష్ణ నివాసానికి చేరుకుంటున్నారు. పెద్ద కుమారుడు జానకిరామ్ మృతితో హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని నందమూరి హరికృష్ణ ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి.