మొయినాబాద్ ఫాంహౌస్‌లో రేవ్‌పార్టీ భగ్నం

Posted On:08-12-2014
No.Of Views:355

రంగారెడ్డి: నగర శివార్లలో రేవ్‌పార్టీ కల్చర్ పెరిగిపోతోంది. మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో సోమవారం అర్థరాత్రి రేవ్ పార్టీని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. ఓ ఫాంహౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఎనిమిది మంది ముంబై మోడల్స్, 22మంది యువకులను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.