జనసేనకు ఈసీ గుర్తింపు

Posted On:11-12-2014
No.Of Views:352

పవన్‌ కల్యాన్‌ స్థాపించిన జనసేన పార్టీకి  ఈసీ గుర్తింపు లబించింది.ప్రస్తుతం చూసినట్లైతే పవన్‌ కల్యాన్‌కి జనాల్లో మంచి ఫాలోయింగే వుంది. పవన్‌ కల్యాన్‌ అన్నా,ఆయన ఆవేశంగా పలికే డైలాగ్స్‌ అన్నా పడి చచ్చేవారు చాలా మంది వున్నారు. అది సినిమా పరంగా ఒక హీరో అంటే క్రేజ్‌ వుంటుంది. కానీ పార్టీ అంటే ఓట్లు పడ్తాయానంటే అది చెప్పలేము ఎందుకంటే ముందుగా వచ్చిన చిరంజీవి పార్టీ పెట్టి ఎన్నికల వరిలో నిలిచి అపజేయాన్ని ఎదుర్కున్నారు..కనుక పవన్‌ కల్యాణ్‌ కూడా పార్టీ తన భుజాల మీద వేసుకొని ముందుకు నడవలేడనిపిస్తుంది. ఎన్టీ ఆర్‌కు వున్నంత అనుభవం కానీ వాగ్థాటి కానీ వీరికి లేవు.ఏదో ఒక పార్టీలో విలీనం చేయటం మాత్రం ఖాయమని అంటున్నా అదీ వేసి చూడాల్సిందే.2014 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు, మోడీ పవన్‌ను బాగా ఉపయోగించుకున్నారు.డబ్బులు కూడా బాగానే ముట్టచెప్పారని ఒక టాక్‌.పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు సినిమా రంగంలోను రాజకీయ రంగంలోను మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
పార్టీకి ఈసీ గుర్తింపు వచ్చింది కనుక ముందు ముందు ఎన్నికల్లో తన పార్టీ తరపు నుండి అభ్యర్థులను నిలబెడుతాడా లేదా అనేది వేచి చూడాలి. రాజకీయాల్లో ఏదైనా కావొచ్చు వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ సిఎం అవచ్చుకూడా ఎందుకంటే మనీ నజరానా ఓటర్ల మహిమ అంతా కలిసితే పవన్‌కి అదృష్టం కలిసి రావచ్చు.
 24, నవంబర్‌ 2014 నుండి రాజకీయ పార్టీగా గుర్తిస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్‌ కార్యాచరణ పైన అందరి దృష్టి ఉందని చెప్పవచ్చు.ఎన్నికల ప్రచారం పవన్‌ కల్యాణ్‌ విపక్షాల పైన నిప్పులు చెరగడంతో పాటు తాను ఇప్పుడు మద్దతిస్తున్న టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వస్తే ప్రజా వ్యతిరేక పనులకు పాల్పడితే తాను నరేంద్ర మోడీ, చంద్రబాబులను నిలదీస్తానని ప్రకటించారు.
ఎన్నికల సమయంలో కనిపించిన పవన్‌ మళ్లీ కనిపించడం లేదనే విమర్శల పైన జనసేన కొద్దిరోజుల క్రితం స్పందించింది. పార్టీకి ఈసీ గుర్తింపు వచ్చాక పవన్‌ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్‌ కార్యాచరణ పైన అందరి దృష్టి పడిరది. 
పవన్‌ కల్యాన్‌కి ఇది మంచి అవకాశం ప్రజలకు ఉపయోగ పడే పనులు ఇప్పటినుంచైనా చేస్తే మంచిది. ప్రజలతో మమేకమై తిరుగుతూ వారి కష్టనష్టాలను తెలుసుకొని వారిని ఆర్థికంగా ఆదుకుంటూ ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకుంటే తప్పకుండా సిఎం అయ్యే అవకాశాలు వున్నాయి. ప్రస్తుతం  ప్రజలకు ఒక కొత్త పార్టీ కావాలి. పాత పార్టీ నాయకులతో వారు విసుగు చెంది వున్నారు.
                                                         `షహనాజ్‌