సెక్స్ ఏమైనా దెయ్యమా...? సెక్సుపై నేను ఓపెన్... దీపికా పదుకునే ప్రియుడు

Posted On:11-12-2014
No.Of Views:380

బాలీవుడ్ హీరోహీరోయిన్లు సెక్సుపై ఒకరికి మించిన వ్యాఖ్యలు ఒకరు చేస్తున్నారు. తాజాగా దీపికా పదుకునె ప్రియుడు రణవీర్ సింగ్ సెక్సుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ కుర్రహీరో ప్రముఖ కండోమ్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. మరి దాని మహిమో ఏమోగానీ సెక్సుపై లెక్చర్లు ఇస్తున్నాడు. సెక్స్ గురించి జనం బహిరంగంగా మాట్లాడటానికి ఎందుకు మొహమాటపడతారో తనకు అర్ధం కావడంలేదంటున్నాడు. సెక్స్ అనేది దెయ్యం కానీ లేదా ఒక చెడు విషయం కాని కాదని అంటున్నాడు. జీవితంలో ఓ ప్రధానమైన విషయంపై జనం ఇంకా నాలుగు గోడల మధ్యనే కూర్చుని మాట్లాడుకోవడం ఏంటంటున్నాడు. అసలు సెక్సుపై టెలివిజన్ ఛానల్స్ బహిరంగ చర్చలు పెట్టాలంటున్నాడు. ఇంకేం... ఈ చర్చల్లో దీపికా పదుకునె, రణవీర్ ను పిలిస్తే బావుంటుందేమో అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.