రజనీకాంత్ 65వ బర్త్‌డే వేడుకలు.. లింగ చిత్రం విడుదల కూడా...!!

Posted On:11-12-2014
No.Of Views:363

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన 65వ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పురస్కరించుకుని ఆయన నటించిన కొత్త చిత్రం 'లింగ' కూడా ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీసు రికార్డులను బద్దలుకొడుతుందన్న అంచనాలున్నాయి. రజనీ జన్మదినం, 'లింగ' విడుదల నేపథ్యంలో తమిళనాట రజనీ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇకపోతే.. 'లింగ' చిత్రం కథ తమదేనంటూ పలువురు వ్యక్తులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ చిత్రానికి మరింత ప్రచారం లభించినట్లైంది. చిత్రాన్ని నిలుపుదల చేయాలన్న పిటిషన్లను తొసిపుచ్చిన హైకోర్టు, రూ.10 కోట్లను డిపాజిట్ చేయాలని చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్‌కు సూచించింది. అయితే ప్రస్తుతానికి రూ.3 కోట్లను కోర్టుకు సమర్పించిన వెంకటేశ్, మిగతా రూ.7 కోట్లను సోమవారం అందజేయనున్నట్లు తెలిపారు. దీనికి కోర్టు కూడా సమ్మతించడంతో ఈ చిత్రం విడుదలకు సంబంధించిన చిక్కులు తొలగిపోయి శుక్రవారం ప్రదర్శితంకానుంది.