బోరబండలోని ఓ ఇంట్లో పేలుడు.. ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు

Posted On:11-12-2014
No.Of Views:350

హైదరాబాద్‌లోని బోరబండలో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులకు స్వల్ప గాయలయ్యాయి. చిన్నారులు ఇంటి బయట ఆడుకుంటుండగా పేలుడు ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ప్రమాదం సంభవించిన వెంటనే చిన్నారులను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కృష్ణవేణి అనే బాలిక పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు కృష్ణవేణి అనే బాలిక రక్తపు మడుగులో కొట్టు మిట్టాడుతుండటం స్ధానికుల హృదయాలను కలచి వేసింది. జిలిటెన్ స్టిక్స్ పేలినట్లుగా స్ధానికులు అనుమానిస్తున్నారు. మిగిలిన ఇద్దరు చిన్నారులను యాదమ్మ, నర్సింహాగా గుర్తించారు. స్ధానికులు తెలిపిన సమాచారం ప్రకారం ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.