ఆడిలైడ్‌ టెస్ట్‌.. 363 పరుగుల ఆధిక్యంలో ఆస్గేలియా

Posted On:12-12-2014
No.Of Views:291

ఆస్గేలియా: భారత్‌, ఆస్గేలియా మధ్య జరుగుతున్న ఆడిలైడ్‌ టెస్ట్‌లో ఆస్గేలియా నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 363 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆస్గేలియా తొలి ఇన్నింగ్స్‌లో 517/7 డిక్లేర్డ్‌ కాగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 444 పరుగులకు ఆలౌట్‌ అయింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్గేలియా జట్టు ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. వార్నర్‌ 102, మార్ష్‌ 40, రోజర్‌ 21, వాట్సన్‌ 33, క్లార్క్‌ 7 పరుగులు చేసి ఔటయ్యారు. స్మిత్‌(52), హాడిన్‌(14) న్ఠాౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లు కె.వి.శర్మ 2, షమీ, రోహిత్‌ శర్మ, అరోన్‌ తలో వికెట్‌ తీశారు.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 444 ఆలౌట్‌ 
ఆడిలైడ్‌ టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 444 పరుగులకు ఆలౌట్‌ అయింది. కోహ్లీ 115, పుజారా 73, రహానే 62,మురళి విజయ్‌ 53, రోహిత్‌శర్మ 43, షమీ 34, శిఖరధావన్‌ 25, సాహా 25 పరుగులు చేశారు. ఆస్గేలియా బౌలర్లు లియాన్‌ 5, సిడిల్‌, జాన్సన్‌ చెరో రెండు వికెట్లు, హారీస్‌ ఒక వికెట్‌ తీశారు.