ముగిసిన నాలుగో దశ పోలింగ్‌

Posted On:14-12-2014
No.Of Views:356

జమ్మూకశ్మీర్‌, రaార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జమ్మూకశ్మీర్‌లో 49 శాతం, రaార్ఖండ్‌లో 61.65 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ దశలో జమ్మూకశ్మీర్‌లో 182 మంది అభ్యర్థులు, రaార్ఖండ్‌లో 217 మంది అభ్యర్థుల అదృష్టం తేలనుంది. రెండు రాష్గాల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికలను, చలిని లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.