బెయిలొచ్చింది!

Posted On:19-12-2014
No.Of Views:322

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి బెయిల్‌ మంజూరయింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. కల్వకుర్తి  ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిపై విష్ణు దాడి చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే! తన క్లయింట్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని, ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని మొదట విష్ణు తరపు లాయర్ వాదించారు. ఈ వాదనలను ప్రభుత్వ తరపు లాయర్ నర్సింగరావు తోసిపుచ్చినప్పటికీ, విష్ణుకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. విష్ణు బెంగుళూరులో ఉన్నట్టు సమాచారం.