నటి హుమైమాతో సానియా భర్త షోయబ్ చక్కర్లు

Posted On:19-12-2014
No.Of Views:391

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి హుమైమా మాలిక్‌తో చక్కర్లు కొడుతున్నారు. అయితే, ఆమె తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని షోయబ్ అంటున్నారు. సానియా మీర్జాకు, షోయబ్ మాలిక్‌కు మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్న సమయంలో ఈ వార్త బయటకు పొక్కింది. సానియా మీర్జాతో తమ వివాహ జీవితం చక్కగా సాగిపోతోందని, తమ మధ్య ఏ విధమైన పొరపొచ్చాలు లేవని షోయబ్ మాలిక్ అన్నారు. తామిద్దరం ఇప్పుడు దుబాయ్‌లో ఒక చోటే ఉన్నామని చెప్పారు. క్రిడాకారులుగా తాము తమ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని, అంత మాత్రాన విడిపోతామని అనడంలో అర్థం లేదని ఆయన అన్నారు. షోయబ్ హుమైమా మాలిక్, ఆమె కుటుంబ సభ్యులకు సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు - తనకు, సానియాకు మధ్య బంధం పటిష్టంగా ఉందని, అది అంత సులభం కాదని వివాహానికి ముందే తమకు తెలుసునని, తమపై నిరాధారమైన కథనాలు రావడం నిస్పృగతకు గురి చేస్తుందని ఆయన అన్నారు. తాను ప్రపంచ కప్ ఆడబోనని చెప్పినట్లు వచ్చిన వార్తాకథనాలపై కూడా ఆయన మండిపడ్డారు. తాను ఆ విధంగా ఎప్పుడూ చెప్పలేదని అన్నారు.