తగ్గిన లంగ్స్‌ ఇన్ఫెక్షన్... సోనియా ఆరోగ్యం ఓకే...!

Posted On:19-12-2014
No.Of Views:385

సోనియా ఊపిరితిత్తుల్లో ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గిందని, తద్వారా ఆమె ఆరోగ్య పరిస్థితి కొంత మేరకు మెరుగైనట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గురువారం స్వల్ప అస్వస్థత కారణంగా ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు. ఈ విషయమై సోనియా వైద్యం పొందుతున్న ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ సోనియా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వచ్చినట్టు తెలిపారు. ఆమెకు ఊపిరితిత్తుల మార్గంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కాస్త తగ్గుముఖం పట్టిందన్నారు. దీంతో  సోనియా ఆరోగ్యం కాస్త మెరుగైనట్లు తెలిపారు.కాగా గతంలో కేన్సర్ బారిన పడిన సోనియాగాంధీ.. ,లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఆమె వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లి వస్తుంటారు.