ఉగ్రధారి హతం

Posted On:20-12-2014
No.Of Views:310

పెషావర్‌లోని ఆర్మీ స్కూల్‌లోఉగ్రవాదుల మారణహోమానికి కారకుడైన టీటీపీ ఛీప్ ముల్లా ఫజుల్లా హతమయ్యాడు. పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఈయన మృతి చెందినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని నాన్-గర్-హర్ ప్రాంతంలో పాక్ సైన్యం- అమెరికా దళాలు మానవరహిత విమానాలతో దాడులు నిర్వహించాయి. తాలిబన్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడుల్లో ఫజుల్లాతోపాటు మరో 8 మంది హతమైనట్లు వెల్లడించింది. తెహ్రిక్ - ఈ- తాలిబన్ పాకిస్థాన్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఫజుల్లా అసలు పేరు ముల్లా రేడియో! తన ఎఫ్‌ఎం స్టేషన్ ద్వారా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి యువతీ యువకులను ఆకట్టుకోవడం ఇతనికి వెన్నతోపెట్టిన విద్య. పెషావర్‌ సైనిక స్కూల్‌లో జరిగిన ఘటనలో తాలిబన్లు విచక్షణరహితంగా కాల్పులు జరిగి 140 మందిని పిల్లలను పొట్టనపెట్టుకున్నారు. ఈ దుశ్చర్య యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనకు కారకులైన ఉగ్రవాదులను తుదముట్టించేందుకు పాక్ సైన్యం నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఫజుల్లా స్థావరం గురించి పక్కాగా సమాచారం తెలుసుకున్న సైన్యం, డ్రోన్ల సాయంతో మట్టుబెట్టింది.