జాతిపితకు ఘోరఅవమానం

Posted On:20-12-2014
No.Of Views:399

జాతిపిత మహాత్మగాంధీకి ఘోర అవమానం జరిగింది. మహాత్ముడి మహనీయతను మంటగలుపుతూ దారుణానికి ఒడిగట్టింది ఓ కంపెనీ. గాంధీని మద్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చేసింది. ఆయన పేరుతో బీరు ఫ్లేవర్ తయారు చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటోంది న్యూఇంగ్లాండ్ చెందిన ఓ బేవరేజస్ కంపెనీ. బీరు బాటిళ్లు, బీరు టిన్నులపై గాంధీ బొమ్మను ముద్రించడంతోపాటు అమ్మకాలు కొనసాగిస్తోంది. 
అమెరికాలోని కనెక్టికట్ రాష్ర్టంలో వుడ్‌బ్రిడ్జ్ సిటీ కేంద్రంగా ఆల్కహాలు తయారు చేస్తోంది ఈ సంస్థ. న్యూ ఇంగ్లాండ్ కంపెనీ వ్యవహారశైలిపై యూఎస్‌లోని భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణమే బీరు ఉత్పత్తులపై గాంధీ బొమ్మను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు మహాత్ముడి చిత్రాలను అవమానకర రీతిలో ప్రచురిస్తున్న కంపెనీపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ కంపెనీ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.