సైకిల్ ఎక్కిన జూపూడి

Posted On:20-12-2014
No.Of Views:286

ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. దళితుల మనోభిప్రాయాల మేరకే తాను టీడీపీలో చేరానని అన్నారు. తనని నమ్ముకున్న వారికి న్యాయం జరగాలంటే అది టీడీపీతోనే సాధ్యం అని వ్యాఖ్యానించారు.రాష్ర్టాభివృద్ధిలో దళితుల పాత్ర కూడా వుండాలనే ఉద్దేశంతోనే టీడీపీలోకి వస్తున్నట్లు చెప్పారు. తాను వదిలేసిన పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ... ఇన్నాళ్లు అవినీతికి లొంగి నడుచుకోవాల్సి వచ్చిందని... కానీ ఇకపై ధైర్యంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడే అవకాశం వచ్చిందని జూపూడి పేర్కొన్నారు.