కారు-కమలం దోస్తీ?

Posted On:20-12-2014
No.Of Views:349

కేంద్ర క్యాబినెట్‌లో చేరాలని, సొంతరాష్ర్టంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తెరాస పార్టీ తహతహలాడుతోందని వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ఢంకా భజాయించడంతో ఆ పార్టీలోకి దూకేవాళ్ల సంఖ్య ఎక్కువైంది. పైగా రాష్ర్టాల్లో సైతం బీజేపీ గాలులు బలంగా వీస్తుండడంతో వ్యూహాత్మకంగా ఆ పార్టీతో కలిసి పని చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని ఒక కధనం. ఇటీవల తెరాస కేంద్ర కేబినెట్‌లో కూడా చేరడానికి సుముఖంగా వుందంటూ పైవాళ్లకు సంకేతాలందాయ్. కేబినెట్‌లో చేరిక విషయం అలావుంచితే.. ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహా మేరకు కేసీఆర్ ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు. తమకు మద్దతు ప్రకటించిన విషయమై ప్రధాని మోదీ ఆ వర్గాలకు ‘థ్యాంక్స్’ చెప్పారని అంటున్నారు. ఐతే రాష్ర్టాల్లో ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ స్వతంత్రంగానే ఎదగాలన్నది ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయంగా వుంది. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో పేదలకు 125 గజాల ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేయాలనే నిర్ణయాల్ని బీజేపీ రాష్ర్ట శాఖ స్వాగతించింది. తెరాస మిత్రపక్షమైన ఎంఐఎం వ్యతిరేకించింది. అందుకే కేంద్రంతో విభేదించకుండా వ్యూహాత్మకంగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు కనబడుతుంది.